ఆవు పేడతో యుద్ధం.. ఎక్కడో తెలుసా?

by  |
ఆవు పేడతో యుద్ధం.. ఎక్కడో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఎక్కడైనా గానీ పండగంటే పద్ధతిగా స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పూజాపురస్కారాల్లో పాల్గొంటారు. కానీ ఒక గ్రామంలో మాత్రం దీపావ‌ళి ముగింపు వేడుక‌లను ఆవుపేడ‌ యుద్ధంతో ఘ‌నంగా నిర్వహిస్తారు. ఆవు పేడతో యుద్ధం ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ‘గుమటాపురా’ అనే గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు ప్రతీఏట దీపావళి ముగింపు వేడుకల్లో ఆవు పేడతో యుద్ధం చేస్తారు. ఈ వేడ‌క‌ల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు ఉదయాన్నే అంద‌రి ఇళ్లలోని ఆవు పేడ‌ను ట్రాక్టర్లలో సేకరించి గ్రామంలోని ఆల‌య సమీపాన గల గ్రౌండ్‌లో కుప్పగా పోస్తారు. ఆ తర్వాత పురుషులందరూ అందులోకి దూకి ఒక‌రిపై ఒక‌రు పేడ‌ను విసురుకుంటారు. ఇలా ప్రతి సంవత్సరం దీపావ‌ళి ముగింపు వేడుక‌ల‌ను ‘గొరెహ‌బ్బ’ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వేడుక‌ల్ని చూసేందుకు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజ‌లు ఈ గ్రామానికి త‌ర‌లివ‌స్తారు. ఇలా ఆవు పేడతో ‘గొరెహ‌బ్బ’ పండుగ జరుపుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని గ్రామస్తుల విశ్వాసం.

Next Story

Most Viewed