- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భార్య నల్లగా ఉంది.. అందుకే అలా చేశా..
<p>దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇక తన భార్య నల్లగా ఉందన్న ఏకైక కారణంగా తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు ఓ ప్రబుద్దుడు. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో షహనాబి అనే మహిళకు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో మార్చిలో పెళ్లి జరిగింది. కట్నంగా మూడెకరాల పొలం కూడా తీసుకు వచ్చింది. అయితే అమ్మాయి నల్లగా ఉందన్న కారణంగా అత్తింటి వారు వేధింపులు మొదలు పెట్టారు. తనను హేళన […]</p>

దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇక తన భార్య నల్లగా ఉందన్న ఏకైక కారణంగా తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు ఓ ప్రబుద్దుడు. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో షహనాబి అనే మహిళకు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో మార్చిలో పెళ్లి జరిగింది. కట్నంగా మూడెకరాల పొలం కూడా తీసుకు వచ్చింది. అయితే అమ్మాయి నల్లగా ఉందన్న కారణంగా అత్తింటి వారు వేధింపులు మొదలు పెట్టారు. తనను హేళన చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని వాపోయింది.
ఇప్పుడు అదనపు కట్నం కావాలని బలవంతం చేస్తున్నారని, తాను ఒప్పుకోక పోవడంతో తలాక్ చెప్పాడని భర్త పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి వద్దనున్న మిగిలిన పొలం అమ్మి తనకు 10 లక్షలు తీసుకురావాలని, దాంతో పాటు తనకు కారు కూడా తీసుకురమ్మని నిత్యం వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, త్రిబుల్ తలాక్, గృహ హింస, అదనపు కట్నం కేసు, నల్లగా ఉందని హేళన చేయడం లాంటివి నిందితుని మీద నమోదు చేశామని ఇన్ స్పెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు






