అక్కడ రూ. 70కే కిలో టమాటా.. క్యూ కట్టిన జనం

112
CM-Stalin

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి ప్రస్తుతం టమాటాను అధిక ధరకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రికార్డు స్థాయిలో రూ. 150కి చేరడంతో స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని ప్రభుత్వ దుకాణాల్లో సబ్సిడీలో టమాటాలను పంపిణీ చేయాలని, కిలో టమాటా రూ. 70 కే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్టాలిన్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..