- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కార్మికులకు మంత్రి బియ్యం పంపిణీ
<p>దిశ, మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీలో 500 మంది నిరుపేదలకు మంత్రి మల్లారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని కోరారు. దాతల సహకారంతోనే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలు లాక్డౌన్ను పాటిస్తున్న కారణంగా.. అక్కడ పనిచేసే కార్మికులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బియ్యం పంపిణీకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. కార్యక్రమంలో […]</p>

X
దిశ, మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీలో 500 మంది నిరుపేదలకు మంత్రి మల్లారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని కోరారు. దాతల సహకారంతోనే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలు లాక్డౌన్ను పాటిస్తున్న కారణంగా.. అక్కడ పనిచేసే కార్మికులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బియ్యం పంపిణీకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్ ఛైర్మన్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
tag: minister mallareddy, Distribution, rice, migrant workers, medchal
Next Story






