- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు చేరవేసే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ఈ నెల 20లోపు అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరుకుంటాయని స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్ చిత్రా రాంచంద్రన్ గురువారం తెలిపారు. జూలై 25లోపు స్థానిక ఎస్ఎంసీల సమక్షంలో పుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని ఆయా జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పుస్తకాల పంపిణీకి సంబంధించి రోజూవారీ […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు చేరవేసే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ఈ నెల 20లోపు అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరుకుంటాయని స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్ చిత్రా రాంచంద్రన్ గురువారం తెలిపారు. జూలై 25లోపు స్థానిక ఎస్ఎంసీల సమక్షంలో పుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని ఆయా జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పుస్తకాల పంపిణీకి సంబంధించి రోజూవారీ నివేదికను రాష్ట్ర అధికారులకు ఆన్లైన్లో పంపించాలని అందులో సూచించారు.
Next Story






