ఒక్క రోజులో 4 లక్షల డోసులు పంపిణీ

by  |
ఒక్క రోజులో 4 లక్షల డోసులు పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ వేగవంతమైనది. 18 ఏళ్లు పై బడిన వారి కోసం వైద్యాధికారులు గ్రామాల్లో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని వారిని గుర్తించి, దాని ఆవశ్యకతను వివరించి ఎక్కడికక్కడే డోసులు ఇస్తున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్​ కు ఆరోగ్యశాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి తొలి రోజు అద్భుతమైన ఆదరణ లభించింది. ఒక్క రోజులోనే ఏకంగా 4.1 లక్షల మందికి డోసులు ఇచ్చిన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటి వరకు జరిగిన పంపిణీలో ఇదే గరిష్ఠం కావడం గమనార్హం.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫోకస్​ పెట్టారు. ప్రతీ ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్​ తీసుకొని వారిని గుర్తించి టీకాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. ఈ మేరకు స్థానిక మెడికల్​ ఆఫీసర్లు, స్టాఫ్​ నర్సు, అంగన్​ వాడీలు, రెవెన్యూ సిబ్బంది, ఆశాలు, ఏఎన్​ఎంలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి పీహెచ్​ సీల పరిధిలోని ప్రతీ గ్రామానికి వెళ్తున్నారు.

విస్తృతంగా అవగాహన..

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 52 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్​ పొందారు. మరో 48 శాతం మందికి ఈనెలాఖరు వరకు కనీసం ఒక్క డోసునైనా ఇవ్వాలని ఆరోగ్యశాఖ టార్గెట్​ పెట్టుకున్నది. దీంతో ప్రతీ గ్రామంలో వ్యాక్సిన్​ పై అవగాహన కల్పిస్తూ డోసులు పంపిణీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే స్థానిక అధికారులు పంటపోలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలకూ అవగాహన కల్పించడం గమనార్హం.
ఇప్పటి వరకు జరిగిన టీకా పంపిణీ ఇలా..

కేటగిరి డోసు1 డోసు2
హెల్త్​కేర్ 3,04,240 2,33,609
ఫ్రంట్​లైన్​ 3,16,919 2,22,665
18–44 78,37,349 18,73,917
45పైబడి 63,37,619 33,42,608
మొత్తం 1,47,96,127 56,72,799


Next Story

Most Viewed