- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక తోడేళ్లు! మంజీరాలో రాత్రి వేళల్లో ఇసుక మాఫియా రాజ్యం
ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. రాత్రి పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తోడేళ్ల మాదిరి తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇసుక మా ఫియా ఆడిందే ఆట.. పాడింది పాటగా దందా సాగుతోంది.

ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. రాత్రి పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తోడేళ్ల మాదిరి తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇసుక మా ఫియా ఆడిందే ఆట.. పాడింది పాటగా దందా సాగుతోంది. ప్రభుత్వ కట్టడాలు, ఇందిరమ్మ ఇండ్లు, స్థానిక అవసరాలకు ఇసుక అనుమతులు ఇవ్వడం సమంజసం. ఒక వైపు అధికారులు ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. కానీ మరో వైపు మాత్రం వ్యాపారం ‘మూడు పువ్వులు-ఆరు కాయలు’గా విరాజిల్లుతోంది. అసలు అధికారుల ఆదేశాలు పనిచేయడం లేదా..? లేదా స్థానిక అధికారులు.. ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారా? అని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అక్రమ తవ్వకాలను కట్టడి చేయాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ మాఫియాకు కొందరు పోలీసు, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దిశ, మద్నూర్ : ఇసుక అక్రమ రవాణాతో మంజీరా నది మౌన రోదనకు గురవుతుంది. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం మారిన ఈ అక్రమ రవాణా ఆగడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి దక్కాల్సిన సొమ్మును అక్రమార్కుల జేబుల్లో దండుకు పోతున్నారు. ఇసుక మాఫియాతో కొంతమంది అధికారులు కుమ్మక్కు కావడంతో జోరుగా దందా కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతమైన సిర్పూర్ గ్రామ పరిసరాల్లో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే చాలు ట్రాక్టర్లతో మోతాదుకు మించి ట్రాలీలో ఇసుక రవాణా లోడ్ చేసి సరిహద్దులు మహారాష్ట్ర, కర్ణాటక తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు ఒక ట్రాక్టర్ కు ఇసుక అమ్ముకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తూతు మాత్రం తనిఖీలు చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే చాలు ఇసుక ట్రాక్టర్లతో గ్రామాల్లో అధిక శబ్దాల చేసుకుంటూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయికి అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని స్థానికులు వినతి పత్రం ఇచ్చారు. సబ్ కలెక్టర్ కింది అధికారులకు ఆదేశించిన అధికారుల్లో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
రైతుల మౌన రోధన..
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారుల దృష్టికి తేచ్చినా రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా మూలంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో లో నీటిమట్టం పడిపోవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. అప్పుడప్పుడు పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసిన ఇసుక వ్యాపారుల తీరు మారడం లేదు. అక్రమ తవ్వకాల వల్ల కాలువలు, వాగులు, వ్యవసాయ భూములు, రహదారులు దెబ్బతింటున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో రైతులు కోరుతున్నారు.






