- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయం 9కే ఓపెన్.. క్వార్టర్‌పై రూ.40 ఎక్స్‌ట్రా.. సత్తుపల్లి బార్ల దందా!
సత్తుపల్లి పట్టణంలోని బార్ అండ్ (ఎలైట్) ఫ్యామిలీ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సత్తుపల్లి పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ తీరు బెల్టుషాపులను తలపిస్తున్నాయి. అనుమతులు ఒకలా తీసుకుని నిర్వహణ మరోలా ఉంటోంది. టాయిలెట్, ఫ్యాన్లు, లైట్లు వంటి సదుపాయాలు, కోరిన ఆహార పదార్థాలు ఉండవు. ఎటువంటి సదుపాయలు కల్పించకపోయినా మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచే మద్యాన్ని బయటికి పంపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం తొమ్మిది గంటలకే తెరుస్తూ.. పక్కనే వైన్స్ షాపులను గడువు సమయానికి ముందే బంద్ చేయిస్తూ.. ఈ బార్‌లకు మందుబాబులు వచ్చేలా చేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలోని బార్ అండ్ (ఎలైట్) ఫ్యామిలీ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బార్ పేరు చెప్పి బెల్ట్ షాపులను పోలిన బార్ అండ్ రెస్టారెంట్లుగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. కనీసం సౌకర్యాలు కల్పించకుండానే క్వాటర్‌పై అదనంగా రూ 40.వసూలు చేస్తూ భారీగా దండుకుంటున్నట్లు తెలుస్తోంది. బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వహణపై పలుసార్లు మందుబాబులు ఫిర్యాదు చేసినా.. సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన రెండు బార్ అండ్ రెస్టారెంట్‌లో కనీసం టాయిలెట్ సదుపాయాలు కల్పించడం లేదు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మందుబాబులు బస్టాండ్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఫుడ్ విషయానికొస్తే రెస్టారెంట్ పేరు చెప్పి పల్లి ప్యాకెట్లు, బాయిల్డ్ ఎగ్స్, వేయించిన పల్లీలు అమ్ముతున్నారు తప్ప ఇష్టమైన ఫుడ్, వసతులు కల్పించడం లేదు. మందుబాబులకు ఫ్యాన్, లైట్ వంటి సౌకర్యాలే కల్పించడం లేదని విమర్శలు ఉన్నాయి.
నిబంధనలు బేఖాతరు
సత్తుపల్లిలో బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. బార్ అండ్ రెస్టారెంట్లో అమ్మవలసిన మద్యం విచ్చలవిడిగా బయటికి వెళ్లిపోతున్నది. నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటలకు తెరవాల్సి ఉన్నప్పటికీ సత్తుపల్లిలో మాత్రం 9 గంటలకే బార్ అండ్ రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉన్న వైన్‌షాపులకు రాష్ట్ర ప్రభుత్వం 10గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చినా.. కేటాయించిన సమయం కంటే 30 నిమిషాలు ముందే బంద్ చేస్తూ.. మందుబాబులను సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు మళ్లిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు
సత్తుపల్లిలో గత కొంతకాలంగా నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్‌లు, వైన్ షాపుల నిర్వహణను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లలో నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిశీలించాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్లపై తనిఖీలు చేయాలని కోరుతున్నారు.






