గవర్నర్ కార్యక్రమంలో నకిలీ విలేఖరి హల్‌చల్‌!

by Ramesh Naini |   (  Updated:2025-11-28 16:29:48  IST  )

గవర్నర్‌ అధికారిక కార్యక్రమంలో నకిలీ విలేఖరి ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది.

గవర్నర్ కార్యక్రమంలో నకిలీ విలేఖరి హల్‌చల్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్‌ అధికారిక కార్యక్రమంలో నకిలీ విలేఖరి ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. హైటెక్ సిటీలోని ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో జాతీయ మీడియా సంస్థలకు చెందినవిగా చూపిస్తూ లోగోలు, యాక్సెస్‌ కార్డుల మాదిరిగా తయారు చేసిన సామగ్రిని ఉపయోగించి ఒక గుర్తు తెలియని వ్యక్తి విలేఖరి వేషంలో హాజరైనట్లు తెలిసింది.

ఈ విషయాన్ని గుర్తించిన జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు మదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిందితుడు జాతీయ మీడియా విలేఖరిగా పరిచయం చేసుకుంటూ కార్యక్రమాలకు ప్రవేశిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అతని వద్ద ఉన్న వివిధ మీడియా సంస్థల లోగోలు, స్టిక్కర్లు, కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, ఈ ఘటన మీడియా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. నకిలీ గుర్తింపులతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ప్రవేశించడంపై మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story