- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని పిల్లలకి అందించాలి
- ప్రతి సిబ్బంది సెలవుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలి
- ములుగులో ఆరోగ్య కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ
దిశ,ములుగు: గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలో పలు శాఖలను ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. సిబ్బంది సమయానికి విధుల్లో హాజరవ్వాలని, ప్రతి ఒక్కరు సెలవుల వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆమె సూచించారు. రోగులతో మాట్లాడిన కలెక్టర్, పిల్లలకు తప్పనిసరిగా వేడి చేసి చల్లార్చిన నీరు తాగించాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్స చేయించుకోవాలని, వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె ప్రాముఖ్యతనిచ్చారు.
ఆసుపత్రికి మిషన్ భగీరథ పైప్‌లైన్ కనెక్షన్ అవసరం ఉందని మెడికల్ ఆఫీసర్ చెప్పగా, వెంటనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. తరువాత కలెక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, రైతు శిక్షణ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. నర్సరీలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు దేశీ రకాలను ఎక్కువగా పెంచాలని ఆమె సూచించారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే పద్ధతుల్లో నర్సరీ అభివృద్ధి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, ఉద్యానవన అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.






