ఆశా కార్యకర్తల నిరసన

by velandi.Saikiran |

పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు చెల్పూర్ ప్రైమరీ

ఆశా కార్యకర్తల నిరసన
X

దిశ, హుజురాబాద్ రూరల్: ​పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు చెల్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...జూలై నెల పారితోషికాలు ఇంకా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా కార్యకర్తలకు నెలకు 18 వేలు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని కోరారు.​


ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్ , ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని, పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.​ ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు డైరెక్ట్ గా ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, వారికి వెయిటేజ్ మార్కులు నిర్ణయించాలని,​ గత 15 రోజుల సమ్మె సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు.తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు, అవసరమైతే కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు లత, పుష్పాలత, రమాదేవి, సుజాత, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Next Story