దివ్యాంగుల కోసం ‘సూపర్ హీరో’ కాస్టూమ్స్

by  |
దివ్యాంగుల కోసం ‘సూపర్ హీరో’ కాస్టూమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్ :

చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది తమ ఫేవరెట్ హీరోల స్టైల్‌ను ఫాలో అవాలని లేదా రాయల్‌ లుక్‌లో కనిపించాలని కోరుకుంటారు. అందుకే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తమ పిల్లలను గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వంటి వీరవనితల్లా తయారు చేసి ముచ్చట పడిపోతుంటారు. ఇక ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్‌లో భాగంగా డిస్నీ క్యారెక్టర్స్‌ అయిన సూపర్ హీరోస్, ఏంజెల్స్‌లా తయారు చేస్తుంటారు. అయితే వీరితో పాటు వీల్ చెయిర్‌ పర్సన్స్‌ కూడా అలానే రెడీ కావాలని కోరుకుంటారు. కానీ ఆ కాస్టూమ్స్ వీరికి సరిపోవు. అలాంటి వారి కోసమే డిస్నీ.. ప్రత్యేకమైన ఔట్‌ఫిట్స్ తీసుకొచ్చింది.

దివ్యాంగులకు వీల్ చెయిర్ కవర్ సెట్స్, డిజేబుల్డ్ చిన్నారులు కూడా ఈజీగా వేసుకునేలా వీల్ చెయిర్ ర్యాప్స్‌ వంటి సరికొత్త కలెక్షన్స్‌ను ‘హలోవిన్’ కలెక్షన్స్ పేరుతో లాంచ్ చేసింది డిస్నీ. వీల్ చెయిర్‌‌కు అనుగుణంగా స్ట్రెచీ ఫ్యాబ్రిక్స్‌ను ఇందుకోసం ఉపయోగించింది. అంతేకాదు, వీల్ చెయిర్‌లో కూర్చుండే ఉంటారు కాబట్టి, లాంగ్ లెంగ్త్ డ్రెస్ డిజైన్, వెహికల్ ట్యూబ్స్ కవర్ చేయడానికి ఫ్లాప్ ఓపెనింగ్స్‌తో వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయడం విశేషం. డిస్నీ పాపులర్ సినిమాల్లోని సూపర్ హీరో, హీరోయిన్ల కాస్టూమ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కాస్టూమ్స్‌తో వాళ్లు కూడా సూపర్ హీరోల్లా తళుక్కున మెరవొచ్చు. ఇంక్రెడిబుల్స్ 2 సూట్, బజ్ లైట్ ఇయర్ కాస్టూమ్, సిండ్రెల్లా డ్రెస్ ఇందులో ప్రధానంగా ఉన్నాయి. షాప్‌డిస్నీ.కామ్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.3700 (38 పౌండ్లు) ఉండగా, స్మాల్ సైజ్ నుంచి ఎక్స్‌ట్రా లార్జ్ వరకు అందుబాటులో ఉన్నాయి.

Next Story

Most Viewed