తను ప్రెగ్నెంట్ కాదు : సలియాన్ తల్లి

by  |
తను ప్రెగ్నెంట్ కాదు : సలియాన్ తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: తన కూతురు గర్భం దాల్చలేదని, అనవసరమైన పుకార్లు పుట్టించొద్దని బాలీవుడ్ హీరో సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. గత జూన్‌ నెలలో దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా ఆమె చనిపోయిన వారం తర్వాత సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలనే దిశ ఆత్మహత్య‌కు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని, గర్భం దాల్చిందని పలు పుకార్లు షికార్లు కొట్టాయి. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలయ్యాయని బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే ఆరోపించారు. తాజాగా దీనిపై సుశాంత్ మాజీ మేనేజర్ తల్లి స్పందించారు. తన కూతురుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని దిశ సలియాన్ తల్లి వాసంతి సలియాన్ స్పష్టంచేసింది.

తన కూతురిపై ఎవరూ అత్యాచారం చేయలేదని, ఆమె ఎప్పుడూ ప్రెగ్నెంట్ కూడా కాలేదని చెప్పుకొచ్చింది. అమెకు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ క్లియర్‌గా ఉన్నాయని పేర్కొంది. దయచేసి తన కూతురు మరణం పై అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరింది. అబద్ధాలు ప్రచారం చేసేవారు ముందుగా , నిజానిజాలు అర్థం చేసుకోవాలని సూచించింది.



Next Story

Most Viewed