బన్నీ స్టెప్పులకు 'లోఫర్' బ్యూటీ ఫిదా

by  |
బన్నీ స్టెప్పులకు లోఫర్ బ్యూటీ ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా ఎఫెక్ట్‌తో ఇంటికే పరిమితమయ్యారు సినీ ప్రముఖులంతా. షూటింగ్‌లు వాయిదా పడడంతో … లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పుస్తకాలు చదువుతూ, కొత్త సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘ అల వైకుంఠపురంలో ‘ సినిమాను చూసిందట. చిత్రంలో స్టైలిష్ స్టార్ బన్నీ డ్యాన్స్‌కు ఫిదా అయిన భామ …బన్నీ ఇలా ఎలా చేయగలుగుతున్నావ్? అంటూ ఇన్‌స్టాగ్రాం స్టేటస్‌లో ప్రశ్నించింది.. దీనికి రిప్లై ఇచ్చిన బన్నీ… నాకు మ్యూజిక్ అంటే ప్రేమ. గుడ్ మ్యూజిక్‌ వల్లే అంత బాగా డ్యాన్స్ చేయగలుగుతున్నాను. మీ కాంప్లిమెంట్‌కు థాంక్యూ అని చెప్పాడు. ఈ కన్వర్జేషన్ షేర్ చేసిన దిశా… మాకు స్ఫూర్తి అందిస్తున్న మీకు ధన్యవాదాలు అని చెప్పింది. బన్నీ స్టెప్పులకు బాలీవుడ్‌లో చాలా మంది అభిమానులున్నారు. ఈ మధ్య గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా బన్నీ డ్యాన్స్‌కు మెస్మరైజ్ అయినట్లు తెలిపాడు. కాగా తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పక్కన ‘లోఫర్’ మూవీలో కనిపించింది దిశా.

లాక్ డౌన్ పీరియడ్‌లో సినీ సెలబ్రీటీలంతా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ద్వారానే ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారానే అన్ని అప్‌డేట్స్ ఇస్తున్నారు. లైవ్ చాట్స్‌‌లో పాల్గొంటూ అభిమానులకు బోర్ కొట్టకుండా.. ఇళ్లలోనే ఉండేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

Tags: Loafer, Disha Patani, Allu Arjun, Ala Vaikuntapuramlo, Dance

Next Story

Most Viewed