పవన్-క్రిష్ మూవీ టైటిల్‌పై చర్చ

by  |
పవన్-క్రిష్ మూవీ టైటిల్‌పై చర్చ
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిరియాడికల్ మూవీ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తుందని సోషల్ మీడియాలో చాలా రోజులుగా చర్చ జరుగుతుండగా.. కొత్తగా సినిమా టైటిల్‌పై డిస్కషన్ నడుస్తోంది. పవన్ 27వ సినిమాగా వస్తున్న చిత్రానికి మూవీ యూనిట్ ‘విరూపాక్ష’ టైటిల్‌ ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు ‘హరిహర వీరమల్లు’ టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పటికే ఫైనల్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదల కాబోతుండగా.. థియేటర్స్‌లో పండుగ చేసుకునేందుకు వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed