పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగుడు

by Shyam |   (  Updated:2021-03-30 06:09:38  IST  )

<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవడానికి పిల్లను ఎవ్వరు ఇవ్వడంలేదని మనస్థాపం చెందిన ఒక దివ్యాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉగ్రవాయి గ్రామానికి చెందిన షేర్ల శ్రీకాంత్ ఒక దివ్యాంగుడు. రోజురోజుకు వయసు మీద పడుతున్నా తనకు ఎవరు పిల్లను ఇవ్వడం లేదని గత కొద్దికాలంగా తీవ్ర మనస్థాపానికి లోనవుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయలుదేరిన శ్రీకాంత్ గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం శ్రీకాంత్ మృతదేహం నీటిపై [&hellip;]</p>

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగుడు
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవడానికి పిల్లను ఎవ్వరు ఇవ్వడంలేదని మనస్థాపం చెందిన ఒక దివ్యాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉగ్రవాయి గ్రామానికి చెందిన షేర్ల శ్రీకాంత్ ఒక దివ్యాంగుడు. రోజురోజుకు వయసు మీద పడుతున్నా తనకు ఎవరు పిల్లను ఇవ్వడం లేదని గత కొద్దికాలంగా తీవ్ర మనస్థాపానికి లోనవుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయలుదేరిన శ్రీకాంత్ గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం శ్రీకాంత్ మృతదేహం నీటిపై తేలడంతో గమనించిన కొందరు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story