ప్రముఖ నటి భర్తకు కరోనా.. జాగ్రత్తగా ఉండాలని సూచన

by Vadlamudi Anukaran |   (  Updated:2021-04-12 00:21:26  IST  )

<p>దిశ, వెబ్ డిస్క్: ప్రస్తుతం దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఈ కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను వదలడం లేదు. చిత్ర పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, నటి కుష్బూ భర్త సుందర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కుష్బూనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. View this post on Instagram [&hellip;]</p>

ప్రముఖ నటి భర్తకు కరోనా.. జాగ్రత్తగా ఉండాలని సూచన
X

దిశ, వెబ్ డిస్క్: ప్రస్తుతం దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఈ కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను వదలడం లేదు. చిత్ర పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, నటి కుష్బూ భర్త సుందర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కుష్బూనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు.

“గత రెండు రోజుల క్రితం నా భర్త సుందర్ కి కరోనా నిర్దారణ అయ్యింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల సలహామేరకు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ చేసాం “అని తెలిపారు. అంతేకాకుండా “మా ఇంట్లో వారు, ఆఫీస్ లో ఉన్నవారందరూ పరీక్షలు చేయించుకున్నాం. అందరికి నెగిటివ్ వచ్చింది.. ఎవరైనా సుందర్ ని కలిసి ఉంటే వెంటనే టెస్ట్ లు చేయించుకోవాల్సిందిగా కోరారు. అందరు మాస్క్ ధరించి, జాగ్రత్తగా ఉండాలని” సూచించారు.

Next Story