చిరుతపులితో నోముల భగత్.. రామ్ గోపాల్ వర్మ సెన్సెషనల్ కామెంట్

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కే వేస్తానని ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. చిరుతపులితో నోముల భగత్‌ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఈ విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను సింహం, పులితో పోల్చిన రాంగోపాల్‌ వర్మ ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులిని వాకింగ్‌కు [&hellip;]</p>

చిరుతపులితో నోముల భగత్.. రామ్ గోపాల్ వర్మ సెన్సెషనల్ కామెంట్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కే వేస్తానని ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. చిరుతపులితో నోముల భగత్‌ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఈ విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను సింహం, పులితో పోల్చిన రాంగోపాల్‌ వర్మ ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళ్లిన నోముల భగత్‌ను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. తనకే కనుక సాగర్‌ నియోజకవర్గంలో ఓటుంటే ఈ నెల 17న జరిగే ఉపఎన్నిక పోలింగ్‌లో నోముల భగత్‌కే ఓటు వేస్తానని తెలిపారు.

Next Story