గోదావరి యాసలో సుధీర్ బాబు..

by  |
గోదావరి యాసలో సుధీర్ బాబు..
X

దిశ, వెబ్‌డెస్క్ : సుధీర్ బాబు హీరోగా వస్తున్న సరికొత్త చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్‌కు ఇది రెండో చిత్రం కాగా.. టైటిల్ ఆసక్తి రేకిత్తిస్తోంది. ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్‌లో శ్రీదేవి, గోలి సోడా, లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా.. దీనిపై స్పందించారు డైరెక్టర్ కరుణ.

సరదాగా సాగే ఈ ప్రేమ కథలో శ్రీదేవి, సోడా ప్రధాన అంశాలని, ఈ చిత్రం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. సుధీర్ బాబు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్‌గా కనిపిస్తుండగా.. ఈస్ట్ గోదావరి గ్రామీణ యువకుడిగా ఆకట్టుకోనున్నారని తెలిపారు. సుధీర్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది భిన్నమని.. తన కెరియర్‌లో ఈ సినిమా మైలురాయిలా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. హీరో న్యూ అవతార్ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్న డైరెక్టర్.. తనను చాలా సహజంగా చూపించబోతున్నామని, ఈ చిత్రం కోసం గోదావరి యాస కూడా నేర్చుకుంటున్నారని చెప్పారు. శ్రీదేవి, సోడాకు సుధీర్ బాబుతో ఉన్న అనుబంధం ఏంటి? టైటిల్ అలా ఎందుకు ప్లాన్ చేశామనేది సినిమా చూస్తే అర్థం అవుతుందన్నారు. కాగా ఈ నెలాఖరులో సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుండగా.. కరోనాను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


Next Story

Most Viewed