'పుష్ప' మొదటి పార్ట్ ఒక్కటే పది 'కేజీఎఫ్' సినిమాలతో సమానం- డైరెక్టర్

by  |
buchibabu comments
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబో లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సుకుమార్ సైతం తగ్గేదేలే అన్నట్టు గా ఈ సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ డీ గ్లామరైజెడ్ పాత్రలో జీవించేశాడు. ఆ విషయం టీజర్ చూసిన ప్రతిఒక్కరికి అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాపై సుక్కు కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు బన్నీ ఫ్యాన్స్ ని ఉర్రుతలూగించేసాయి. ఇంతకుముందెప్పుడు చూడని బన్నీని చూస్తారని, పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మరో సెన్సేషన్ గా మారుతుందని సుక్కు పలు ఇంటర్వ్యూ లో తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఈ మాటలు బన్నీ ఫ్యాన్స్ లో ‘పుష్ప’ పై భారీ అంచనాలు నెలకొల్పేలా చేశాయి. ఇక తాజాగా సుక్కు శిష్యుడు, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు పుష్ప సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ఇటీవల బుచ్చిబాబు ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘పుష్ప’ సినిమా గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ” పుష్ప సినిమా చూసాను కాబట్టి చెప్తున్నాను.. మొదటి పార్ట్ ఒక్కటే పది ‘కేజీఎఫ్’ సినిమాలతో సమానం.. అల్లు అర్జున్ నటన మరియు సుకుమార్ గారి డైరెక్షన్ తో ‘పుష్ప’ సినిమా మరో లెవల్ లో ఉందంటూ” బుచ్చి బాబు సుక్కును, బన్నీని ఆకాశానికేత్తేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు మాటలు బన్నీ ఫాన్స్ లో సంచలాన్ని సృష్టిస్తున్నాయి. హాలీవుడ్ యాక్షన్ రేంజ్ లో పుష్ప యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ వచ్చింది. ఇక బన్నీ డాన్స్, ఫైట్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇక మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్ తో బన్నీ ఫైట్ అల్టిమేట్ అని టాక్. ఇన్ని ప్రత్యేక ఆకర్షణలు ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.



Next Story