గాలిలో.. దిల్‌రాజు డాటర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

by  |
గాలిలో.. దిల్‌రాజు డాటర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కూతురు హన్షిత అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో వివరించాడు. కూతురికీ తండ్రి అంటే అంతే ఇష్టం. తల్లి అనారోగ్యంతో చనిపోయాక తండ్రి ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశంతో దగ్గరుండి మరి నాన్నకు రెండో పెళ్లి చేసింది. తద్వారా తండ్రికి ఓ తోడునిచ్చింది. రెండో వివాహం తర్వాత వచ్చిన దిల్ రాజు 50వ బర్త్ డేను చాలా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది కూతురు. టాలీవుడ్, కోలీవుడ్, సాండల్‌వుడ్, మాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలకు ఈ ఫంక్షన్‌కు ఆహ్వానించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది.

అంత గొప్పగా కూతురు తన బర్త్ డేను జరిపించినప్పుడు అంతకన్నా గొప్పగా కూతురి పుట్టినరోజును సెలెబ్రేట్ చేయాలనుకున్న దిల్‌రాజు..గాలిలో సెలెబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఇందుకోసం ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేశాడు. ఫ్లైట్ గాల్లోకి ఎగరగానే తనకు సర్‌ప్రైజ్ ఇస్తూ ఆకాశంలో పుట్టినరోజు వేడుకలు జరిపాడు. కూతురితో బర్త్ డే కేక్ కట్ చేయించి గాల్లోనే సంబరాలు చేసిన దిల్‌రాజు..ఆ తర్వాత కుటుంబంతో కలిసి రిసార్ట్ వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హన్షిత. పిక్చర్స్‌లో హన్షితతో పాటు తన భర్త, కూతురు, దిల్‌రాజు, ఆయన భార్య ఉన్నారు.

Next Story