- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం జగన్‌ను కలుస్తాం.. హీరో నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు
దిశ, ఏపీ బ్యూరో: టికెట్ల ధరల వివాదంపై త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తామని దిల్ రాజు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులను సినీ పెద్దలం కలుస్తామని చెప్పుకొచ్చారు. అపాయింట్ మెంట్ ఖరారు అయిన వెంటనే జగన్‌ను కలుస్తాం. టికెట్ల ధరల వివాదంపై కమిటీ ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం ఈజీ అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయవద్దని మనవి చేస్తున్నా. సమస్యలపై వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. సినీ పరిశ్రమను వివాదాస్పదం చేయొద్దు. పెద్ద సినిమాలు విడుదల చేయాల్సిందే. సినిమా విడుదలలలో కష్టమైనా, నష్టమైనా ముందుకే వెళ్లాల్సిందేనని దిల్ రాజు చెప్పారు.
ఈ సందర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం వేరన్నారు. నాని వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఆయన మనసుల్లోకి వెళ్లి చూడాలని, అప్పుడే ఆయన బాధ ఏమిటో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. తన రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిన బాధ ఆయనలో ఉందని చెప్పారు. నాని చెప్పిన విషయం ఒకటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటని దిల్ రాజు సూచించారు.
- Tags
- dil raju