సుశాంత్‌కు మ్యూజికల్ ట్రిబ్యూట్

by  |
సుశాంత్‌కు మ్యూజికల్ ట్రిబ్యూట్
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా సాధారణ స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగినవాడు. సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన తను.. సినిమా హీరోగా రాణించాడు. సినిమా సినిమాకు తన నటనలో పరిణితి చూపిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందడమే కాదు.. తన సింప్లిసిటీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే ఆయన మరణం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త మరింత ఆవేదనకు గురిచేసింది.

తను లేకపోయినా తన అభిమానులను అలరించేందుకు ఒక సినిమాను మాత్రం చేసి.. ప్రేక్షకులకు శాశ్వతంగా సెలవు పలికాడు. కాగా సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీలో సినిమా విడుదల కానుండగా.. 22న(బుధవారం) కథానాయకుడు సుశాంత్‌కు మ్యూజికల్ ట్రిబ్యూట్( సంగీత నివాళులు) ఇవ్వనున్నారు. మ. 12:00 గంటల నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్, సింగర్ శ్రేయాఘోషల్‌తో పాటు మరికొందరు గాయకులు, దిల్ బెచారా మూవీ యూనిట్ పాల్గొననుంది.

Next Story

Most Viewed