దిల్ బెచారా ట్రైలర్ అప్‌డేట్

by  |
దిల్ బెచారా ట్రైలర్ అప్‌డేట్
X

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి ఇంకా ఎవరు బయటకు రాలేదు. అందరూ సుశాంత్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. భావోద్వేగానికి గురవుతున్నారు. సుశాంత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’ చూసేందుకు అందరూ వేచి చూస్తున్నారు. ఈ చిత్రం జులై 24న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర ట్రైలర్ సోమవారం రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఆ చిత్ర బృందం సోషల్‌ మీడియాలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దిల్ బెచారా హీరోయిన్ సంజనా సంఘీ కూడా ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. సుశాంత్‌ను మిస్ అవుతున్నట్లుగా పేర్కొంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ చబ్రా దర్శకత్వం వహించారు. కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించారు.



Next Story

Most Viewed