- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది కఠినమైన పరిస్థితి: సుశాంత్ హీరోయిన్
<p>దిల్ బెచారా ట్రైలర్, సాంగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రికార్డులు సృష్టించాయి. కారణం ఒకే ఒక్కడు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్. దీనికి ఖరీదు.. తన ప్రాణం కాగా.. దిల్ బెచారా డే వచ్చేసింది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 24న విడుదల కాబోతున్న సినిమాను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అందరూ వెయిట్ చేస్తుండగా.. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది హీరోయిన్ సంజనా […]</p>

దిల్ బెచారా ట్రైలర్, సాంగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రికార్డులు సృష్టించాయి. కారణం ఒకే ఒక్కడు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్. దీనికి ఖరీదు.. తన ప్రాణం కాగా.. దిల్ బెచారా డే వచ్చేసింది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 24న విడుదల కాబోతున్న సినిమాను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అందరూ వెయిట్ చేస్తుండగా.. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది హీరోయిన్ సంజనా సంఘీ.
నా మన్నీ.. నువు మమ్మల్ని చూస్తున్నావని, ఆశీర్వదిస్తూ ఉన్నావని.. మమ్మల్ని చూసి నవ్వుతున్నావని తెలుసు అని పోస్ట్ చేసింది. డైరెక్టర్ కాస్టింగ్ చాబ్రా చెప్పినట్లు నాకు, తనకు ఫస్ట్ సినిమా అయినా దిల్ బెచారా.. నీకు మాత్రం చివరి సినిమా ఎలా అవుతుంది? జీవితం అసలు సరైంది కాదు అని బాధ పడింది.
నువు లేవన్న నమ్మశక్యం కానీ కఠినమైన పరిస్థితుల్లో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మాకు బలాన్ని ఇచ్చినందుకు థాంక్స్ చెప్పింది. ప్రతీ ఒక్కరికీ శాంతి, అనుకూలత, ప్రశాంతత కోసం ప్రార్థిస్తున్నామని.. దిల్ బెచారా సినిమాను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కోరింది.
View this post on InstagramA post shared by Sanjana Sanghi | Kizie Basu (@sanjanasanghi96) on






