భారీగా డీజిల్ చోరీ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

186
Diesel

దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ మిలటరీ బేస్‌లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 2 వందల కోట్ల డాలర్ల విలువైన డీజిల్‌ దొంగల పాలైంది. ఈ ఘటన మిహైల్ కోగన్నిసియాను యూఎస్ మిలటరీ బేస్‌లో చోటుచేసుకుంది. దీనిపై రోమేనియా యాంటీ-మాఫియా సంస్థ డీఐఐసీఓటీ స్పందించింది. అమెరికా ప్రభుత్వానికి నష్టం చేకూర్చాలని 2017 నుంచి కొన్ని గ్రూప్‌లు ప్రయత్నిస్తున్నాయని, అమెరికా ప్రభుత్వ ఇంధన దొంగతనం కూడా అందులో భాగమే అని అధికారులు తెలిపారు.

ఇందుకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ కనిపెట్టి తీరుతామని, ఇక్కడ వేల సంఖ్యలో మిలటరీ సోల్జర్స్ ఉన్నారని వారు తెలిపారు. అయితే మిహైల్ కోగల్నిసియాను మిలటరీ బేస్‌తో పాటు ఇతర ప్రదేశాల్లోనూ ఇంధనం చోరీకి గురైందని వెల్లడించారు. ప్రస్తుతం తమ నిఘాలో ఉన్న గ్రూప్‌లను తనిఖీ చేస్తున్నామని, అనుమానం ఉన్న 7 గురిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ అనుమానితుల వివరాలు మాత్రం వెల్లడించలేదు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..