ప్రారంభమైన 'ధరణి' సేవలు

by  |
ప్రారంభమైన ధరణి సేవలు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి వెబ్ పోర్టల్‎లో సేవలను ప్రారంభించారు. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నేడు 946 మంది రిజిస్ట్రేషన్లకు నగదు చెల్లించారని.. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed