హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించిన ధనుష్..

by  |
హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించిన ధనుష్..
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ సూపర్ స్టార్ ధనుష్ మరో హాలీవుడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ద గ్రే మ్యాన్’ సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’, ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ సినిమాలను డైరెక్ట్ చేసిన రుసో బ్రదర్స్ ఈ మూవీ దర్శకులు కాగా.. క్రిస్ ఇవన్స్, ర్యాన్ గ్లోసింగ్, అనా దె అర్మస్‌ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ధనుష్. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ద ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రం తర్వాత ధనుష్ చేయబోతున్న సెకండ్ హాలీవుడ్ మూవీ ఇదే కాగా.. ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో ‘ద గ్రే మ్యాన్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ అదే పేరుతో తెరకెక్కనుంది.

కాగా ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీలో భాగం అయ్యేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపిన ధనుష్.. ఇన్నాళ్లుగా తన మీద ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో ధనుష్ పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.


Next Story