ధనుష్ – సాయి పల్లవి ‘రౌడీ బేబి’ మరో రికార్డ్

by  |
rowdy-baby
X

దిశ, సినిమా : తమిళ్ ఫిల్మ్ ‘మారి’లోని ధనుష్ – సాయి పల్లవిల ‘రౌడీ బేబి’ సాంగ్ న్యూ రికార్డ్స్ సెట్ చేస్తూనే ఉంది. యూట్యూబ్‌లో మోస్ట్ వాచ్డ్ తమిళ్ సాంగ్‌గా నిలిచిన ఈ పాట.. ప్రస్తుతం యూట్యూబ్‌లో 5 మిలియన్ లైక్స్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్‌ సాంగ్‌గా మరో ఘనత సాధించింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా ‘రౌడీ బేబి’ సాంగ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా.. ప్రభుదేవా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన పాటలో ధనుష్ – సాయిపల్లవిల మూవ్స్‌కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ పాట1.1 బిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం.

https://twitter.com/ManobalaV/status/1413413766184673281?s=20

కాగా ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అత్రంగి రే’ షూటింగ్ కంప్లీట్ చేయగా.. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో వస్తున్న తన 49వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక సాయి పల్లవి తెలుగు ప్రాజెక్ట్స్ ‘లవ్ స్టోరి’, ‘విరాటపర్వం’ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తోంది.

Next Story

Most Viewed