మళ్లీ ‘కర్ణన్’ కాంబినేషన్.. త్వరలో సెట్స్‌పైకి

by  |
Dhanush, Karnan
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్, మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కర్ణన్’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కరోనా టైమ్‌లోనూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించింది. కాగా ఇదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేయనున్నట్లు ప్రకటించాడు ధనుష్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపిన హీరో.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నాడు.

ఇక ధనుష్ త్వరలోనే బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అత్రాంగి రే’లో కనిపించనున్నాడు. సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన సినిమా ఆగస్టు 6న రిలీజ్ కానుంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ బిగ్ బడ్జెట్ హాలీవుడ్ పిక్చర్ ‘ది గ్రే మ్యాన్’లోనూ ధనుష్ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. రుసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.



Next Story