- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్.. డీహెచ్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో డెల్టా ప్లస్ రకం కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాస రావు.. గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఈ వేరియంట్ కేసు ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదని వెల్లడించారు. తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 97 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు తెలిపారు. వారిలో 83 లక్షల మంది తొలి డోసులో వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 కేంద్రాలు, 24 మొబైల్ వ్యాన్స్ ద్వారా వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి 30 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచర్లు ఐడీ కార్డు చూపించి వ్యాక్సిన్ తీసుకోవచ్చునని అన్నారు.