- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డా.శ్యామల కేసు : డీజీపీ ఆదేశాలివే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: డా.శ్యామల మృతిపై ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆరా తీసినట్లు సమాచారం. గత నెల 4వ తేదీన విశాఖ కశింకోట మండలం తాళ్లపాలెం పోలవరం కాలువలో… కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ శ్యామల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాగా శ్యామల మృతిపై అనుమానాలు ఉన్నాయని.. న్యాయం చేయాలంటూ ఇటీవల బీసీ సంఘాలు, శ్యామల బంధువులు విజయవాడలో రాష్ట్ర డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: డా.శ్యామల మృతిపై ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆరా తీసినట్లు సమాచారం. గత నెల 4వ తేదీన విశాఖ కశింకోట మండలం తాళ్లపాలెం పోలవరం కాలువలో… కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ శ్యామల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
కాగా శ్యామల మృతిపై అనుమానాలు ఉన్నాయని.. న్యాయం చేయాలంటూ ఇటీవల బీసీ సంఘాలు, శ్యామల బంధువులు విజయవాడలో రాష్ట్ర డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డాక్టర్ శ్యామల కేసులో పోలీసులు తీసుకున్న చర్యలు గురించి డీజీపీ ఆరా తీశారు. అలాగే శ్యామల కేసుకి సంబంధించిన ఫైల్ ని తీసుకుని విజయవాడకు రావాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసులను ఆదేశించారు.
Next Story






