- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల పోటీ.. అసలు మహాత్మ్యం ఏంటంటే?
తిరుమలలో ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ నిన్న(గురువారం) విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ నిన్న(గురువారం) విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 30, 31 జనవరి 1 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఆన్‌లైన్‌లో పేర్ల నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. నిన్న రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా సాయంత్రానికి 4.60 లక్షల మంది నమోదు చేసుకున్నారు. భక్తులు డిసెంబర్ 1 వరకు ttd వెబ్‌సైట్, TTD యాప్ లేదా 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి డిసెంబర్ 2న మెసేజ్‌లు పంపుతారు.
వైకుంఠ ద్వార దర్శనం ఎంత పుణ్యమంటే?
వైష్ణవాలయాల్లో ఏడాది పొడవునా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావించి, పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకకు చిహ్నంగా వీటిని తెరుస్తారు. అందుకే ఇంతటి మహిమ గల వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ గురువారం తేదీలను ప్రకటించడంతో వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుమల భక్తులు(Tirumala Devotees) అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.






