- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రథ సప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చేస్తారంటే?
హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. ఇక మాఘ మాసం శుక్ల పక్ష సప్తమి రోజున రథ సప్తమిని (Ratha saptami) జరుపుకుంటారు. ఈ రోజునే ప్రత్యేక్ష దైవమైన ఆ సూర్య భగవానుడు జన్మించాడని చెబుతుంటారు. రథ సప్తమి రోజున ముఖ్యంగా తలపై జిల్లేడు ఆకులు ఉంచుకుని స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, ఏడు జన్మాల పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. అసలు రథ సప్తమి రోజున తలపై జిల్లేడు ఆకులను పెట్టి ఎందుకు స్నానం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
విశిష్టత
రథసప్తమి నాడు సూర్యుడుని ఆరాధించడం వలన తేజస్సు, ఐశ్వర్యం కలుగుతాయని, శోకము, రోగము వంటి బాధల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతుంటారు. ఇక పురాణాల ప్రకారం.. రథసప్తమి రోజున అగ్నిష్వాత్తులు అనే పండితుడు తనువు చాలించిన తరువాత స్వర్గలోకానికి వెళ్లేందుకు ఎంతో నిష్టగా యజ్ఞం చేస్తున్నారు. ముని భక్తికి తృప్తి చెందిన శివకేశవులు వారిని స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపారు. అయితే దేవ విమానం వచ్చిన సమయంలో ఆ పండితులు యఙ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి సమర్పిస్తుంటారు. ఆవు నేతితో కూడిన హోమద్రవ్యాన్ని అగ్నిలో వేస్తుండగా.. దేవ విమానాన్ని చూసిన ఆ ముని ఆ క్రతువుని కంగారుగా చేసేశాడు.
అయితే, అదే సమయంలో అటుగా ఓ మేక పిల్ల రావడంతో అగ్నిలో వేస్తున్న వేడిగా ఉన్న ఆవు నెయ్యి దానిపై పడి చర్మం ఊడి చనిపోయింది. ఆ చర్మం పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడింది. దీంతో జిల్లేడు ఆకులు కూడా మేక చర్మంలా మారాయి. అయితే, పూర్ణాహుతి సమర్పించే సమయంలోనే ఆ మేక పిల్ల చనిపోవటంతో దాని ఆత్మ వెళ్లి దేవ విమానంలో కూర్చుంది. అంతేకాదు, అగ్నిష్వాత్తులు యజ్ఞఫలం కూడా మేకకి, జిల్లేడు చెట్టుకి దక్కిందని ఆకాశవాణి చెప్పింది. దీంతో అతడు బాధపడుతాడు. ఇది చూసిన దేవతలు జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకుని స్నానం చేస్తే యజ్ఞఫలం వస్తుందని వరమిస్తారు. అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.
జిల్లేడు ఆకుల స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. జిల్లేడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని గ్రహిస్తుంది. జిల్లేడు ఆకుల్లో ఉండే రసాయనాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా జిల్లేడు ఆకుల్లో ఉంటాయి. వాపు, నొప్పి వంటి సమస్యల్ని కూడా జిల్లేడు ఆకు తొలగిస్తుంది.
Read Also..
నేడే రథ సప్తమి.. విశిష్టత, పూజ విధానం






