దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఛట్ పూజ.. అసలు ఈ పూజను ఎందుకు చేస్తారంటే..?

by Malleboina Mahesh |   (  Updated:2025-10-28 03:18:30  IST  )

దేశవ్యాప్తంగా భక్తి, భావనల నడుమ ఛఠ్ పూజ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు నది తీరాలకు, చెరువులకు, సరస్సులకు చేరి సూర్య భగవానుడికి పూజలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఛట్ పూజ.. అసలు ఈ పూజను ఎందుకు చేస్తారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా భక్తి, భావనల నడుమ ఛఠ్ పూజ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు నది తీరాలకు, చెరువులకు, సరస్సులకు చేరి సూర్య భగవానుడికి పూజలు చేస్తున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తున్నారు. భోకా, ఆపిల్, కొబ్బరికాయ, చెరకు వంటి పండ్లతో ప్రసాదం తయారు చేసి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తున్నారు. దీంతో గంగా తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాత్రంతా భజనలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఛట్ పూజ అంటే ఏమిటి..?

ఛట్ పూజ (Chhath Puja) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పూజలలో ఒకటి. దీన్ని ప్రధానంగా సూర్య భగవానుడు, చఠి మాయ (ఉషా దేవి)కి అంకితం చేస్తారు. ఈ పూజలో ప్రకృతి, సూర్యుడు, నీరు, గాలి వంటి మూల తత్త్వాలకు నమస్కారం గా పరిగణిస్తారు. ఇది శుద్ధత, నియమం, ధర్మానికి ప్రతీకగా నిలుస్తోంది. నాలుగు రోజుల పాటు కఠినమైన ఉపవాసం, శరీరం-మనస్సు శుద్ధి చేసుకునే విధానం ఇందులో ఉంటుంది. ఈ పూజను చేసినవారికి సూర్యుని కృప లభిస్తుందని, కుటుంబంలో ఆరోగ్యం, సౌఖ్యం, సంతానం లభిస్తాయని నమ్మకం.

ఛట్ పూజ ఎందుకు చేస్తారు?

ఈ పూజను సూర్య దేవుడికి కృతజ్ఞతగా చేస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పూజలో జీవరాశులందరికీ శక్తి, ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించమని వారు ప్రార్థిస్తారు. సూర్యుడి కాంతి వలన భూమిపై జీవం కొనసాగుతుందని విశ్వసిస్తారు. అందుకే సూర్యాస్తమయం, సూర్యోదయం వేళ సూర్యునికి “అర్ఘ్య” (నీటి నైవేద్యం) సమర్పిస్తారు. మహిళలు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు, శ్రేయస్సు కోసం ఈ నాలుగు రోజుల పాటు కఠిన ఉపవాసం ఉంటారు.

ఏ రాష్ట్రాల ప్రజలు ఛట్ పూజలు జరుపుకుంటారు?

ప్రస్తుతం భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ఛఠ్ పూజలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా మాత్రం ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు ఈ ఛట్ పూజలు పరమ పవిత్రంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ (పూర్వాంచల్ ప్రాంతం) ఓడిశా, పశ్చిమ బెంగాల్ లోని కొంత భాగం, అలాగే నేపాల్ తేరై ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున జరుపుతారు. ఇటీవలి కాలంలో, బీహారీ సమాజం ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో కూడా ఛట్ పూజ ఘనంగా జరుగుతుంది.

Next Story