Maha Bharatham:కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరెవరు ప్రాణాలతో మిగిలారు?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-05 06:44:19  IST  )

మహా భారతం అనగానే గుర్తొచ్చేది.. కౌరవులు, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం.

Maha Bharatham:కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరెవరు ప్రాణాలతో మిగిలారు?
X

దిశ, వెబ్ డెస్క్: మహా భారతం అనగానే గుర్తొచ్చేది.. కౌరవులు, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం. 18 రోజుల పాటు సాగిన ఈ యుద్దాన్ని.. భారత ఇతిహాసాల్లోనే అత్యంత విద్వాంశకరమైన యుద్ధంగా వర్ణిస్తారు. రాజ్యాధికారం కోసం జరిగిన ఈ యుద్ధంలో ఎన్నో లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జంతుజాలం మరణించింది. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ఇక చాలా మంది ఈ కురుక్షేత్ర యుద్ధంతో మహాభారతం ముగిసిపోయిందని అనుకుంటూ ఉంటారు. కానీ, ఆ తర్వాత కూడా కురు వంశ పాలన కొనసాగింది. ఈ నేపథ్యంలో కురుక్షేత్రం తర్వాత ప్రాణాలతో మిగిలిన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పాండవుల 13 ఏళ్ల అరణ్య వాసం ఒక ఏడాది అజ్ఞాత వాసం పూర్తి చేసుకున్న తర్వాత.. తిరిగి తమ రాజ్యాన్ని పొందెందుకు తమ సోదరులైన కౌరవులతో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో18 అక్షౌహిణుల సైన్యం ప్రాణాలు కోల్పోయినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంటే.. దాదాపు 19 లక్షల 68 వేల 300 మందికి పైగా సైనికులు మరణించారు. సాధారణ సైనికులే కాదు.. అతిరథ మహారథులు కూడా చనిపోయారు. కౌరవుల పక్షాన ఉన్నవారంతా దాదాపు మరణించారు. పాండవుల పక్షం కూడా అంతే మేర నష్టపోయింది.ఇక 18 రోజుల తర్వాత ముగిసిన ఈ యుద్ధంలో కేవలం పది మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. అది కూడా.. పంచ పాండవులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులతోపాటు శ్రీ కృష్ణుడు, సాత్యకి, అశ్వథ్థామ, కృపాచార్యుడు, కృతవర్మ.

ఇక, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవుల్లో ధర్మరాజు పట్టాభిషషిక్తుడై 36 సంవత్సరాలు పరిపాలించిన తరువాత, శ్రీకృష్ణుడు దేహత్యాగము చేసాడని తెలిసి, చాలా విచారం పొందుతారు. ఆ తర్వాత అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్‌కు పట్టాభిషేకం చేసి, పాండవులంతా భార్య ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వైపు మహా ప్రస్థానం సాగించారు.ఒక ధర్మరాజు తప్ప మిగిలిన వారు దారిలో ఒకరి తరువాత ఒకరు దేహాన్ని విడిచిపెట్టారు. ధర్మరాజు మాత్రం దేహముతోనే స్వర్గం చేరగలుగుతాడు.

Next Story