Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-20 03:45:23  IST  )

కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది.

Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావటంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు క్యూలైన్‌లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శనివారం స్వామి వారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రెస్, ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను TTD తిరస్కరిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా ఏప్రిల్‌ 15 నుంచి మూడు నెలలపాటు సిఫారసు లేఖలు స్వీకరించరు. స్వయంగా వచ్చే VIP ప్రొటోకాల్‌ పరిధిలోని భక్తులకు మాత్రమే బ్రేక్‌ కల్పిస్తారు.

Next Story