- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope : ఈ రోజు రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశి వారు ఈ రోజు మీ లక్ష్యాల పై దృష్టి పెట్టి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ రోజు పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది. సానుకూల దృక్పథం ఉన్న మిత్రులతో సమయం గడపడం మీకు ఉత్సాహం ఇస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడపండి. సమస్యలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది. కొంత సమయం ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు. ఈ రోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈరోజు మీలో నమ్మకం, శక్తి ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా ఆర్థిక లాభం కలగడంతో బిల్లులు, ఖర్చులు సులభంగా తీరుస్తారు. ఇంటి విషయాల్లో కొంత అసౌకర్యం ఉండొచ్చు. ప్రేమ విషయాల్లో ఆనందకరమైన అనుభూతులు ఉంటాయి. బయటకు వెళ్లి సంతోషంగా గడపడం వల్ల మీ వ్యక్తిత్వంలో మంచి మార్పులు వస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
మిథున రాశి
ఈ రోజుల ఈ రాశివారికి పరిస్థితులు అదుపులోకి వచ్చి ఆందోళనలు తగ్గిపోతాయి. అనుభవం ఉన్న వారి సలహాతో వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాలు గడిస్తారు. దూరపు బంధువుల నుంచి వచ్చే సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ విషయాల్లో సంతోషంగా ఉంటారు. సమయాన్ని వృథా చేసే స్నేహితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. అయితే ఈ రోజు జీవిత భాగస్వామి వల్ల కొంత అసౌకర్యం కలగవచ్చు.
కర్కాటక రాశి
ఈరోజు మీరు ఆశించిన ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. అయితే అధిక ఉత్సాహాన్ని నియంత్రించుకోవడం మంచిది. రోజు రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం వల్ల ఇంట్లో ఆనందం నెలకొంటుంది. బంధువుల ద్వారా మీ అభివృద్ధికి ఉపయోగపడే కొత్త అవకాశాలు రావచ్చు. ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదైనా ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆప్యాయతలు పెరుగుతాయి.
సింహ రాశి
ఈరోజు నెగటివ్ ఆలోచనలు వదిలేయడం మంచిది. దానధర్మాలు లేదా సంఘసేవ చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. బంధువుల వద్ద తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. పిల్లలు చదువు పై దృష్టి పెట్టకపోవడం వల్ల కొంత నిరాశ కలగొచ్చు. ఇటీవల జరిగిన విషయాల వల్ల మనసు కలతగా ఉండొచ్చు కాబట్టి ధ్యానం, యోగా చేయడం మంచిది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు. కుటుంబంలో చిన్నవారితో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. అయితే జీవిత భాగస్వామి తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొద్దిగా అసౌకర్యం కలగవచ్చు.
కన్యా రాశి
ఈ రాశివారు తెలివితేటలతో ఏ కొత్త విషయమైనా సులభంగా నేర్చుకోగలరు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కలుగుతుంది. ఈ రోజు అనుకోని శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి ప్రేమను ఎక్కువగా అనుభవించే రోజు ఇది. ఉద్యోగంలో కూడా మంచి మార్పు కనిపిస్తుంది. అయితే కొంతమంది విద్యార్థులు టీవీ, కంప్యూటర్ వల్ల సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు చిరకాల స్నేహితుడిని కలవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది ఎదురైనా, మీ తెలివితో వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సరదా స్వభావం ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. భాగస్వామి ప్రేమ నిజమైనదని మీరు మరింతగా అనుభవిస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులు తమ పనితనాన్ని నిరూపిస్తారు. ఖాళీ సమయంలో కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆనందంగా ఉండటంతో సంతోషంగా గడుస్తుంది. కొంత అదనపు డబ్బు సంపాదించాలని అనుకుంటే ఆర్థిక పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రేమ విషయాలను బయటకు ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తపడండి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు రావచ్చు, ముఖ్యంగా మార్కెటింగ్ వంటి రంగాల్లో. ఆఫీసు నుంచి వచ్చాక మీకు ఇష్టమైన పనులు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే పాత సమస్య ఒక్కసారిగా బయటకు రావడం వల్ల భాగస్వామితో చిన్న వాదన జరిగే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీలో ఉత్సాహం, శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వచ్చిన అవకాశాలను మంచిగా ఉపయోగించుకుంటారు. వివాహితులకు అత్తామామల నుంచి ఆర్థిక లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. పని పై దృష్టి పెట్టి ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో సినిమా చూడొచ్చు, కానీ సమయం వృథా చేశామేమో అనిపించవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేకంగా అనిపిస్తారు.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవడం అవసరం. పొగ తాగే అలవాటు ఉంటే మానేయడం మంచిది. ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులు కొనకుండా జాగ్రత్తపడండి. పిల్లల నుంచి వచ్చే శుభవార్త మీకు ఆనందం కలిగించవచ్చు. అభిప్రాయ భేదాల వల్ల కుటుంబ సంబంధాలు కొంత దెబ్బతినే అవకాశం ఉంది. పనిస్థలం, ఇంట్లో ఒత్తిడి వల్ల కోపం రావచ్చు కాబట్టి సహనం అవసరం. భవిష్యత్ ప్రణాళికలను ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఖర్చుల విషయంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వాదం జరిగే అవకాశముంది.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశివారు ఎక్కువగా అలసిపోకుండా జాగ్రత్తగా ఉండండి. సరైన విశ్రాంతి తీసుకోవడం అవసరం. దీర్ఘకాల లాభాల కోసం స్టాక్‌లు, మ్యూచ్యువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం మంచిది. సాయంత్రం స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి రెస్యూమ్ పంపడానికి, ఇంటర్వ్యూలకు వెళ్లడానికి మంచి రోజు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్దవారి నుంచి మంచి సూచనలు లభిస్తాయి. జీవిత భాగస్వామి మంచి మూడ్‌లో ఉండడంతో చిన్న సర్‌ప్రైజ్ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రోజు మీ శ్రమకు కుటుంబ సభ్యుల సహకారం లభించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. సాయంత్రం ఒక పాత స్నేహితుడి ఫోన్ మీకు మధుర జ్ఞాపకాలను గుర్తు చేయవచ్చు. ఈ రోజు ప్రేమ, ఆనందంతో గడుస్తుంది. ముఖ్యమైన వారితో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.






