- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope (April 16) : ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తాయో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ తెలివితేటలతో వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు. సన్నిహిత మిత్రులతో గడిపే సమయం మీకు ఉపశమనం ఇస్తుంది. ప్రేమ విషయాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. కార్యాలయంలో విమర్శలకు గురవ్వవచ్చు. సామాజిక సేవలో పాల్గొనే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారి ఓర్పు, సమయస్ఫూర్తి విజయానికి దారితీస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. మీ ఆర్థిక వ్యవహారాలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. పెద్ద పనులను నిర్వహించే అవకాశాలు వస్తాయి. కుటుంబ బాధ్యతల కారణంగా మీ వ్యక్తిగత సమయం తగ్గవచ్చు. దాంపత్యంలో చిన్నచిన్న విభేదాలు తలెత్తవచ్చు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ప్రయాణాలకు అనుకూల సమయం కాదు. ఖర్చులు పెరగడంతో ఆదాయం నిల్వ చేయడం కష్టమవుతుంది. ఉద్యోగంలో సహచరుల పనితీరు నిరాశ కలిగించవచ్చు.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారు చేసే దాణాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లడం కారణంగా ప్రశాంతంగా ఉంటారు. గతంలో ఉన్న దాంపత్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై దృష్టి పెట్టడానికి సమయం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ప్రశాంతంగా గడపండి. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు రావచ్చు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త పడాలి.
కన్య రాశి
ఈరోజు ఈ రాశి వారికి ఇతరుల సలహాలు ఉపయోగపడతాయి. ఖర్చులు నియంత్రణలో ఉండకపోవచ్చు. పాత స్నేహాలు మళ్లీ బలపడతాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
తులా రాశి
ఈరోజు ఈ రాశి వారు కాలాన్ని ఉత్సాహంగా గడుపుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఉద్యోగంలో కృషి చేయాలి. జీవిత భాగస్వామి భావాలను ఇష్టాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యం.
వృశ్చిక రాశి
ఈరోజు ఈ రాశి వారు కొంతమంది పరిచయస్తుల వల్ల మానసికంగా సమస్యలను కొనితెచ్చుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తాయి. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త పడాలి.
ధనుస్సు రాశి
ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
మకర రాశి
ఈరోజు ఈ రాశి వారు కుటుంబ కలహాలతో సమస్యలు ఎదుర్కుంటారు. ఉద్యోగంలో ప్రత్యర్థుల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులతో గడిపే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. దాంపత్యంలో విభేదాలు తలెత్తవచ్చు.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారు ప్రశాంతంగా గడుస్తుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఇంటి పనులు పూర్తి చేయడానికి అనుకూలం. ఉన్నత స్థాయి వ్యక్తుల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటారు.
మీన రాశి
ఈరోజు ఈ రాశి వారి కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంబంధాల్లో అనుమానాలకు తావివ్వకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. అనుకోని అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.






