- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope (APRIL 15) : ఈరోజు రాశి ఫలాలు
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా కలుగుతాయి. దేవుడి పూజలు, మతపరమైన పనుల మీద దృష్టి పెడతారు. కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా శుభకార్యాలకు ఇది మంచి రోజు. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోనవ్వకండి.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. పిల్లల ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబం కోసం కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఈ రాశి వారిలో మరికొన్ని మార్పులు వస్తాయి.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఇంటిపనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు అప్పు ఇస్తే రాతపూర్వకంగా తీసుకోండి. అనారోగ్యంతో ఉన్న బంధువులను చూసి రావడం మంచిది. ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త క్లయింట్లతో డీల్స్ బాగా కుదురుతాయి.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారు బాల్య జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకునే సమయం వస్తుంది. సమీప బంధువులతో కాస్త గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సమయం గడపడం వలన మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారు మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. రావాల్సిన బకాయిలు చేతికందినా పూర్తిగా ఖర్చు చేస్తారు. దూరప్రయాణాలకు వెళ్లే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త ఆఫర్లు ఆకర్షణీయంగా ఉండి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గి డబ్బు లాభం ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారంలో చిన్న సమస్యలు రావచ్చు. ఇంటి పనులు చేసుకుంటూ సమయం గడుపుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి రోజు. కుటుంబ బాధ్యతల మధ్య మీకోసం సమయం కేటాయించండి.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అన్ని సమయాల్లో కుటుంబం అండగా ఉంటుంది. పిల్లల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. పిల్లలు మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కాస్త అనారోగ్యం ఏర్పడవచ్చు. భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు ప్రారంభించండి. జీవిత భాగస్వామితో పిక్‌నిక్‌కు వెళ్లడం మంచిది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతం నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. తోబుట్టువుల సహాయం లభిస్తుంది. అతిథులతో మృదువుగా వ్యవహరించండి. మాట నిలబెట్టుకోలేకపోతే సమస్యలు రావచ్చు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారికి పిల్లలతో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. ఇతరులకు సహాయం చేస్తారు.






