- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala Updates: తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
by Kema Shiva Kumar |
ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.
అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 56,711 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 19,755 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.64 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
Next Story






