Tirumala Updates: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |

ఆపద మొక్కలు వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది.

Tirumala Updates: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కలు వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. మంగళవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. అదేవిధంగా రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్లు తీసుకున్న భక్తులను నేరుగా దర్శనానికి పంపుతున్నారు. ఇక బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex) భక్తులు లేక వెలవెలబోతుండటంతో వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్వారి వారి దర్శనం అవుతోంది. సోమవారం స్వామి వారిని 60,581 మంది దర్శించుకున్నారు. అందులో 19,228 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story