Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 70,457 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,152 మంది భక్తలు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300ల స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.

Next Story