- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల అప్డేట్: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గి సాధారణ స్థితిలో కొనసాగుతోంది. 23 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ (Crowd of devotees) సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అధికారులు వెల్లడించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, అల్పాహారం, పాలు నిరంతరం అందిస్తున్నారు.
మరోవైపు నిన్న ఒక్కరోజే మొత్తం 90,012 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 28,345 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.99 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు (TTD officials) సమాచారం అందించారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు సమయపాలన పాటిస్తూ, క్యూలైన్లలో ఓపికతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






