April 29: నేటితో ముగియనున్న పద్మావతి పరిణయం ఉత్సవాలు.. తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

by Kodari Anjali |

నేడు (ఏప్రిల్ 29) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి పరిణయం ఉత్సవం జరుపుకుంటారు.

April 29: నేటితో ముగియనున్న పద్మావతి పరిణయం ఉత్సవాలు.. తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు (ఏప్రిల్ 29) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి పరిణయం ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవం ఏప్రిల్ 27 నుంచి 29 వరకు జరుగుతుంది. అంటే నేటితో ముగుస్తుంి. ఈ ఉత్సవంలో భాగంగా, స్వామి గరుడ వాహనంపై వివాహ మండపానికి చేరుకుంటారు. తిరుమల ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగలో మూడు రోజుల పాటు వైభవంగా దేవతల వివాహం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా మొదటి రోజు గజ వాహనం, రెండో రోజు అశ్వ వాహనం, చివరి రోజు గరుడ వాహనంపై స్వామి వివాహ మండపానికి వెళ్తారు.

కాగా పండుగ నేపథ్యంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మరీ నేడు తిరుమలలో రద్దీ చూసినట్లైతే.. భక్తులు కంపార్టుమెంట్‌లలో వేచి చూడకుండా క్యూలైన్ కట్టారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 65,904 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,487 అని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Next Story