- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల ప్రభావం, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో, టోకెన్లు లేని ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ఇక ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక టోకెన్ తీసుకున్న భక్తులకు 3 నుండి 5 గంటల వ్యవధిలో దర్శనం పూర్తి అవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే స్వామివారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకునే క్రమంలో 31,106 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 3.63 కోట్లు లభించినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.






