- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి మూడురోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో.. స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. చైత్రశుద్ధ పౌర్ణమికి ఈ వసంతోత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 6.30 గంటలకే శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. వసంత మండపంలో అభిషేక నివేదనలు చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు బంగారు రథంపై మలయప్పస్వామిని ఊరేగించనున్నారు. ఏప్రిల్ 1న వసంత మండపానికి ఉత్సవమూర్తులు మలయప్పస్వామి, ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేయనున్నారు. మూడురోజులపాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ స్నపన తిరుమంజనం చేయనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.






