- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala Samacharam: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం
by Kema Shiva Kumar |
తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. సోమవారం శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారు దర్శనానికి వేచి చూడాల్సిన పని లేదు. అదేవిధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లో భక్తులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ అధికారులు నేరుగా దర్శనానికి పంపుతున్నారు.
సోమవారం స్వామి వారిని 63,729 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 20,957 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






