Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

by Kema Shiva Kumar |

దేవదేవుడు బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేవదేవుడు బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,360 మంది భక్తలు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story