- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల.. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్
by Kema Shiva Kumar |
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుసగా క్రిస్మస్ సెలవులు రావడంతో తెలంగాణ (Telangana)తో పాటు పక్క రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. మాడ వీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతూ కనిపించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వ దర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.
Next Story






